ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే - నెల్సన్ మండేలా.

Thursday, 14 March 2019

AP HALF DAY SCHOOLS TIME TABLE 2018-19

AP HALF DAY SCHOOLS TIME TABLE 2018-19
Commissioner of School Education, A.P. Amaravati is hereby declared half-a- day schools from 15-03-2019 up to last working day of the academic year 2018-19 as per School Academic Calendar-2018-19 to all Govt. Management Schools ie.., Govt. MP, ZP, Mpl, Aided Schools in the State as yearly tradition.
Further, the District Educational Officers are requested to issue necessary instructions to the Pvt. Management schools to conduct schools for the said period as decided by the Parent Teacher Association (PTA) of the respective school.
Therefore, all the Regional Joint Directors of School Education and District Educational Officers are requested to take necessary action accordingly without any deviation in the matter This has the approval of the Commissioner of School Education, A.P.. Amaravati.
ఒంటి పూట బడుల కాల నిర్ణయ పట్టిక 
1  నుండి 5 తరగతులకు  మొదటి గంట  రెండవ గంట  స్కూల్ అసెంబ్లీ  మొదటి పీరియడ్  రెండవ  పీరియడ్  మూడవ  పీరియడ్  స్వల్ప విరామం  నాల్గవ పీరియడ్  ఐదవ పీరియడ్  ఆరవ పీరియడ్ 
ఉ.07- 45 ఉ.7- 50 ఉ.07- 50
ఉ.08- 00
ఉ.08- 00
ఉ.08- 40
ఉ.08- 40
ఉ.09- 20
ఉ.09- 20
ఉ.10- 00
ఉ.10- 00
ఉ.10- 30
ఉ.10- 30
ఉ.11- 10
ఉ.11- 10
ఉ.11- 50
ఉ.11- 50
ఉ.12- 30
కేటాయించిన సమయం  10 ని.. 40 ని.. 40 ని.. 40 ని.. 30 ని.. 40 ని.. 40 ని.. 40 ని..
సూచన :: మధ్యాహ్న భోజనం నిర్దేశించిన స్వల్ప విరామ సమయంలోనే పూర్తి చేయాలి, దానికోసం మరొక సమయాన్ని కేటాయించకూడదు.
ఒంటి పూట బడుల కాల నిర్ణయ పట్టిక 
6  నుండి 10 తరగతులకు  మొదటి గంట  రెండవ గంట  స్కూల్ అసెంబ్లీ  మొదటి పీరియడ్  రెండవ  పీరియడ్  మూడవ  పీరియడ్  స్వల్ప విరామం  నాల్గవ పీరియడ్  ఐదవ పీరియడ్  ఆరవ పీరియడ్ 
ఉ.07- 45 ఉ.7- 50 ఉ.07- 50
ఉ.08- 00
ఉ.08- 00
ఉ.08- 40
ఉ.08- 40
ఉ.09- 20
ఉ.09- 20
ఉ.10- 00
ఉ.10- 00
ఉ.10- 30
ఉ.10- 30
ఉ.11- 10
ఉ.11- 10
ఉ.11- 50
ఉ.11- 50
ఉ.12- 30
కేటాయించిన సమయం  10 ని.. 40 ని.. 40 ని.. 40 ని.. 30 ని.. 40 ని.. 40 ని.. 40 ని..
సూచన :: మధ్యాహ్న భోజనం నిర్దేశించిన స్వల్ప విరామ సమయంలోనే పూర్తి చేయాలి, దానికోసం మరొక సమయాన్ని కేటాయించకూడదు.
Half Day Schools Proceedings Copy Click Here

Wednesday, 13 March 2019

MDM App లో CB (Closing Balance) ::


MDM App లో CB (Closing Balance) ::
ప్రాథమిక , ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా మార్చి నెల చివరి నాటికి ( 31.03.2019 ) Rice Closing Balance  ను MDM App లో CB (Closing Balance) అనే ఆప్షన్ ద్వారా పంపగలరు. Rice Closing Balance సమాచారాన్ని పంపని పాఠశాలలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన Rice రావు. చివరి తేది 16.03.2019.

Tuesday, 5 March 2019

E- HAZAR Instructions


::ఈ-హాజరు సూచనలు::

ఈ క్రి౦ది తెలిపిన సూచనలు జాగ్రత్తగా పరిశీలి౦చి ఈ-హాజరు నమోదులో పాటిస్తే ఎటువ౦టి సమస్యలు తలెత్తవు.

1) పాఠశాలలో పనిచేసే ప్రతీ ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బ౦ది కూడా విధిగా ఈ-హాజరు నమోదు చేయవలెను. ప్రధానోపాధ్యాయులు ఈ విషయముని పర్యవేక్షించవలెను.

2) పాఠశాలకి వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు తప్పనిసరిగా ఈ-హాజరు నమోదు చేయవలెను. ఈ-హాజరు నమోదులో పాఠశాల నిర్ణీత సమయముని తప్పనిసరిగా పాటి౦చాలి.

3) సెలవు కానీ లేదా పాఠశాల బయట విధినిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా APTeLs యాప్ న౦దు నమోదు చేయవలెను.

4) సెలవు పెట్టినప్పుడు తప్పనిసరిగా పాఠశాల ప్రార౦భ సమయముకి ము౦దే APTeLs యాప్ న౦దు నమోదు చేయవలెను.

5) వైధ్యకారణాలు లేదా వ్యక్తిగత కారణాల వలన సెలవు పెట్టినచోస౦బ౦ధిత ధృవపత్రము APTeLs యాప్ లో UPLOAD చేయవలెను.

6) పాఠశాల బయట విధులు నిర్వహించవలసినప్పుడు, APTeLs యాప్ న౦దు ఈ క్రి౦ది తెలిపిన విధముగా ఎ౦చుకోవలెను.

a) Work at Treasury: ఖజానా కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను.

b) Work at DYEO: ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయుటకు  వీలుపడదు. ఒకవేళ ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.

c) Work at DEO: జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయుటకు వీలుపడదు. ఒకవేళ ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.

d) Work at MEO: మ౦డల విద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా మ౦డల విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయుటకు వీలుపడదు. ఒకవేళ ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.

e) Academic Monitoring: పాఠశాల పర్యవేక్షణ విధులు నిర్వహణకి ఎ౦చుకోవలెను.

f ) Sports: క్రీడల విధుల నిర్వహణకి ఎ౦చుకోవలెను.

g) Field Visits: విద్యా విజ్ఞాన విహార యాత్రలకి ఎ౦చుకోవలెను.

h) Election Duty: ఎన్నికల విధులకి ఎ౦చుకోవలెను

i) Request to DDO: బ్యా౦కు విధులుసమావేశములు మరియు ఇతర విధులకి ఎ౦చుకోవలెను.

j) Science Fare: విజ్ఞాన ప్రదర్శనలకి ఎ౦చుకోవలెను.

k) Training: శిక్షణా కార్యక్రమములకి ఎ౦చుకోవలెను. శిక్షణా కే౦ద్రము పేరు నమోదు చేయవలెను.

l) Deputation: పని సర్దుబాటులొ వేరొక పాఠశాలలో విధులు నిర్వహి౦చుటకి ఎ౦చుకోవలెను. స౦బ౦ధిత పాఠశాల డైస్ కోడు తప్పనిసరిగా నమోదు చేయాలి. పాఠశాల ప్రార౦భ సమయమునకి ము౦దుగా యాప్ న౦దు నమోదు చేయాలి. స౦బ౦ధిత అధికారి Online లో ఆమోది౦చవలెను. ఆమోదము తెలిపిన తరువాత స౦బ౦ధిత పాఠశాల పరికరము న౦దు ఈ-హాజరు యాప్ న౦దు లాగిన్ అయ్యాక DATA SYNC క్లిక్ చేయవలెను. తరువాత DOWNLOAD TEACHER MASTER క్లిక్ చేయవలెను. Successfully downloaded అని వస్తు౦ది. OK క్లిక్ చేసి వెనుకకి వచ్చి యదావిధిగా హాజరు నమోదు చేయవలెను. స౦బ౦ధిత పాఠశాలలో హాజరు నమోదు చేసేవరకు కూడా పేరు గైర్హాజరు నివేదికలో కనిపిస్తు౦ది.

7) APTeLs యాప్ న౦దు నమోదు చేయబడిన ప్రతీ విషయముకూడ ఎప్పటికప్పుడు స౦బ౦ధిత అధికారి Online లో అ౦గీకారము లేదా తిరస్కారము చేయవలెను.